ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ‘RRR’ సినిమాలో నటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నాడు. ఈ సినిమా దాదాపు 75 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇక ఈ సినిమా తరువాత రామ్ చరణ్ నూతన దర్శకుడి సినిమాలో నటించబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.

లాక్ డౌన్ సమయంలో ఖాళీగా ఉంటున్న చరణ్.. పలువురు చెప్పిన కథలని వింటున్నాడట. ఈ క్రమంలో సతీష్ అనే నూతన దర్శకుడు చెప్పిన కథ ఆయనకు బాగా నచ్చినట్లు సమాచారం. దీంతో వెంటనే స్క్రిప్ట్ వర్క్ తయారు చేసుకురమ్మని చెప్పాడట. ఇక సతీష్ పుల్ స్క్రిప్ట్ రూపొందించే పనిలో ఉన్నాడంటున్నారు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలోను రామ చరణ్ నటించబోతున్నాడు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో చరణ్ పాత్ర సినిమా కథను మలుపు తిప్పే పాత్రని తెలుస్తుంది.

ఏపీ ప్రభుత్వంపై ట్విట్టర్ లో పోస్ట్ చేసిన పీకే టీం..!

నవీన్ పట్నాయక్, జ్యోతి బసు, వైఎస్ఆర్ లాగా జగన్ కూడా చరిత్రలో నిలిచిపోవాలి