రాంచరణ్ ఒకవైపున రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్అర్ సినిమాతో బిజీ బిజీగా గడుపుతుంటే… మరోవైపున తన తండ్రి చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “సైరా” సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీ బిజీగా గడుపుతున్నారు. సైరా సినిమా కోసం ఇప్పటికే ఒక డిజిటల్ క్యాంపైన్ టీమ్ ను రంగంలోకి దింపి వారికి భారీగా ముట్టజెప్పి పూర్తి బాధ్యతలు అప్పగించారట.

ఇక అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించ తలపెట్టిన “రామాయణం” సినిమాలో రామ్ చరణ్ నటించవలసిందిగా అల్లు అరవింద్ అండ్ టీమ్ అడిగారట. కానీ రామ్ చరణ్ తాను చేయలేనని చెప్పి తప్పుకున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. ఇప్పటికే “ఆర్ఆర్ఆర్” సినిమాతో రామ్ చరణ్ బిజీగా ఉండటంతో పాటు మరికొన్ని కమిట్ మెంట్స్ పెండింగ్ లో ఉండటంతో అరవింద్ ఆఫర్ అంగీకరించలేదని తెలుస్తుంది. 

“రామాయణం” సినిమా దాదాపుగా మూడు బాగాలులో చేయాలని  ఇప్పటికే దానికి సంబంధించి రంగం సిద్ధం చేసుకున్నారు. 500 కోట్ల రూపాయలతో బారి బడ్జెట్ గా అల్లు అరవింద్ తో పాటు… మధు మంతెన, నమిత్ మల్హోత్రా కలసి జాయింట్ వెంచర్ గా సినిమాను బాలీవుడ్, కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ కు చెందిన బారి తారాగణంతో నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ “రామాయణం” రిజెక్ట్ చేయడంతో ఇక తరువాత ఎవరని అప్రోచ్ అవుతారో చూడాలి.