చిరంజీవి హీరోగా మొదటి స్వాతంత్య్ర పోరాటయోధుడు “ఉయ్యాలవాడ నరసింహారెడ్డి” సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ రీతిలో ఆడకపోయినా తెలుగులో మాత్రం అదరగొట్టింది. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను కూడా చిరంజీవి త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కు సంబంధించి కార్యక్రమాలు మొదలయ్యాయి.

ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ ప్లే చేయనున్నాడని, ఈ సినిమా కాస్త నక్సలైట్ భావజాలంతో తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. కొరటాల శివ తాను రాసుకునే కథలో సోషల్ ఎలిమెంట్స్ ఉండేలా కథను రూపొందించుకుంటాడు. అందులో భాగంగానే నక్సలైట్ లకు సంబంధించి వారి ఇతివృత్తాన్ని తెరకెక్కించనున్నారా అన్నది ఆసక్తిగా మారింది. ఈ సినిమా 1980ల కాలంలో మొదలవుతుందట. ఈ సినిమాలో చిరంజీవి యువకుడిగా నటించవలసి ఉందట.

ఇప్పుడు చిరంజీవి వయస్సు 65 ఏళ్ళు కావడంతో యంగ్ చిరంజీవిగా రామ్ చరణ్ తేజ్ ను నటింపచేయాలని ఆలోచన చేస్తున్నారట. చిరంజీవిని యంగ్ గా చూపించే కన్నా రామ్ చరణ్ నటించడం వలన ప్రేక్షకుల ఆదరణతో పాటు తండ్రి కొడుకుల కలయికలో సినిమా అనే ఫీలింగ్ కూడా ప్రేక్షకులకు కలగనుండటంతో అలా ఆలోచిస్తున్నారట. ఈ సినిమాను బడ్జెట్ పరిధులు దాటకుండా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను కూడా కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ తేజ్ నిర్మించనున్నారు. చిరంజీవి సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత వరుసగా వచ్చిన “ఖాదీ నెం :150, సైరా నరసింహారెడ్డి” ఇప్పుడు రాబోతున్న కొరటాల సినిమా మూడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించడం జరిగింది.