తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటిగా 100 సినిమాలు నిర్మించి రికార్డు సాధించారు మూవీ మొగల్ రామానాయుడు. తెలుగు రాష్ట్రాలలో ఈయన పేరు తెలియని వారే ఉండరు. అంతగా కష్టపడి పైకి ఎదిగిన నిర్మాత. ఇక రామానాయుడు 2015వ సంవత్సరంలో మరణించిన సంగతి తెలిసిందే. ఇక రామానాయుడు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి రామానాయుడు స్టూడియోను నిర్మించిన సంగతి తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్ పేరిట దాదాపు అన్ని భాషలలో సినిమాలు నిర్మించి రికార్డు సాధించారు.

రామానాయుడు మరణించిన తర్వాత ఈ స్టూడియో వ్యవహారాలు, ప్రొడక్షన్ భాద్యతలు ఆయన పెద్ద కుమారుడు సురేష్ బాబు చూసుకుంటున్నారు. ఇక ఇప్పడు ఈ రామానాయుడు స్టూడియోను అమ్మబోతున్నారని తెలిసింది. అంతక ముందు భారీ సినిమా షూటింగ్ లతో హడావిడిగా ఉండే రామానాయుడు స్టూడియో ఇప్పుడు పూర్తిగా బోసిపోతుందట. ఇప్పుడు సిటీలో చాలా ఆధునిక స్టూడియోలు వచ్చిన తరువాత ఈ స్టూడియోలో షూటింగ్ లు కరువయ్యాయని తెలుస్తుంది.

ఇక స్టూడియో మెయింటినెన్స్, స్టాప్ ఇవన్నీ ఖాళీగా దండగ అనుకున్న సురేష్ బాబు ఈ స్టూడియోను అమ్ముతున్నారని సమాచారం. సురేష్ బాబు పక్కా బిజినెస్ మాన్. సినిమాను కల కన్నా పక్కా బిజినెస్ లాగా చూసే సురేష్ బాబు హయాంలో సినిమా నిర్మాణం పూర్తిగా తగ్గిపోయింది. ఈ క్రమంలో మీనాక్షి కన్స్ట్రక్షన్స్ వారికి ఈ స్టూడియో అమ్మేసినట్లు వార్తలు వస్త్తున్నాయి. అతి త్వరలో ఈ స్టూడియోను ప్లాట్స్ గా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ స్టూడియో మీద త్వరలోనే సురేష్ బాబు అధికారిక ప్రకటన చేయబోతున్నారని తెలుస్తుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •