సెప్టెంబర్ 15న అందాల నటి రమ్యకృష్ణ తన 50వ పుట్టిన రోజు వేడుకను కుటుంబ సభ్యులతో కలసి జరుపుకున్నారు. రమ్యకృష్ణ, తన భర్త కృష్ణవంశీ ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో బర్త్ డే కేక్ కట్ చేశారు. బర్త్ డే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రమ్యకృష్ణ.. అద్భుతమైన ఐదు పదుల వయసు అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

అంచలంచలుగా స్టార్ హీరోయిన్ గా ఎదుగిన రమ్యకృష్ణ.. ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి మెప్పించింది. ”బాహుబలి” సినిమాలో శివగామిగా రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘క్వీన్’ వెబ్ ఫిలింలో రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ ఫిలింకి సీక్వెల్ రానుంది.

ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ఆర్ధిక మంత్రి..!

పవన్ కళ్యాణ్ సినిమాకు హీరో రామ్ టైటిల్..!