అమెరికా నుంచి ఇండియా వచ్చిన తరువాత దగ్గుబాటి రానా కొద్ది రోజులు ముంబైలోనే ఉండనున్నాడు. అతడికి అమెరికాలోని కాలిఫోర్నియాలో కిడ్నీకి సంబంధించి శస్త్రచికిత్స జరగడంతో వైద్య పరీక్షల నేపథ్యంలో ముంబైలోనే ఉండనున్నాడు. ఇక డాక్టర్స్ కూడా ఎక్కువగా ఒత్తిడికి లోను కావద్దని, కొన్ని రోజులు సినిమాకు సంబంధించి ఎలాంటి బారి యాక్షన్ సన్నివేశాలు చేయవద్దని సూచించారట.

ముంబైలోనే నివాసముండే నాగచైతన్య తల్లి లక్ష్మి దగ్గరే కొన్ని రోజులు రానా దగ్గుబాటి ఉండనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఏర్పాట్లు చేసారని, మూడు నెలల అమెరికా పర్యటన తరువాత మరొక ఆరు నెలలు రెస్ట్ తీసుకుంటే అంత సెట్ అవుతుందని, సినిమా షూటింగ్ లలో పాల్గొన్నా… ఎలాంటి ఇబ్బందులకు గురి చేసే సీన్స్ లేకుండా చూసుకుంటే చాలట. ఇప్పటికే వేణు ఉడుగుల దర్శకత్వంలో “విరాట పర్వం” సినిమాలో నటించవలసి ఉంది. ఆ సినిమాకు సంబంధించి త్వరలో సెట్స్ మీదహ్కు తీసుకొని వెళ్లడానికి చిత్ర యూనిట్ సిద్ధంగా ఉంది.