గత కొంతకాలంగా అమెరికాలో ఉంటున్న రానా దగ్గుబాటి త్వరలో ఇండియాకు తిరిగి రానున్నట్లు తెలుస్తుంది. రానా అమెరికా వెళ్లిన దగ్గర నుంచి అనేకమైన వార్తలు టాలీవుడ్ సర్కిల్ లో గుప్పుమంటున్నాయి. రానాకు కిడ్నీ ఫెయిల్యూర్ అని, అతని తల్లి ఒక కిడ్నీ డొనేట్ చేయడానికి ముందుకు రావడంతో అమెరికాలోని ప్రముఖ వైద్యుడి దగ్గర వైద్యం చేయించుకున్నారని ఇలా అనేకమైన రూమర్స్ రాగా రానా కుటుంబం మాత్రం వాటన్నిటిని ఖండిస్తూ వస్తుంది.

కానీ మరొక వార్త అయితే తన తదుపరి సినిమా కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ తో పనిచేయనున్నాడని అందుకోసమే అమెరికాలో రానా ఉంటున్నాడన్న వార్తలు కూడా ఉన్నాయి. కానీ ఎలాగైనా ఈవారం రావాలని అనుకున్నా మరి కొన్ని వర్క్స్ పెండింగ్ లో ఉండటంతో తరువాత వారం కచ్చితంగా రానా ఇండియాకు తిరిగిరానున్నారు.

రానా ఇండియాకు తిరిగి వచ్చిన వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా అమెరికా వెళ్లే ముందు మొదలైన ‘విరాటపర్వం 1992’లో నటిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో రానాకు జోడిగా సాయి పల్లవి నటిస్తుంది. ఈ సినిమా తరువాత రానా ‘హిరణ్యకశప’ సినిమా చేయనున్నాడు. అతంత బారి బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా కోసమే రానా అమెరికా వెళ్లాడని చెప్పుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •