సుధీర్ వర్మ దర్శకత్వంలో నిన్న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన “రణరంగం” సినిమా గురించి విడుదలకు ముందు ఎన్నో కథలు చెప్పారు. అసలు “రణరంగం” కథ తోపని… ఆ స్టోరీ కోసం శర్వానంద్ పట్టుపట్టాడని… సుధీర్ వర్మ మొదటగా కథ రవితేజకు చెప్పడంతో సినిమా చేయడానికి ఒకే అన్నాడని… తరువాత అదే కథ శర్వానంద్ కు చెప్పగా ఈ స్టోరీ ఎలాగైనా తనకు కావాలని రవితేజని ఒప్పించమని… రవితేజ దగ్గరకు వెళితే పెద్ద మనస్సుతో స్టోరీ ఇచ్చేసాడని… ఈ సినిమా గురించి ఎక్కడ లేని హైప్ క్రియేట్ చేసారు.

కట్ చేస్తే సినిమా నిన్న విడుదలై పెద్ద ప్లాప్ టాక్ మూటకట్టుకుంది. స్లో నరేషన్ తో పాటు… సినిమాలో చెప్పే పాయింట్ ఉన్నా సరిగ్గా చెప్పలేకపోవడంతో దర్శకుడు సుధీర్ వర్మ అండ్ కో బ్యాచ్ పూర్తిగా విఫలమైంది. ఇక సినిమా ముందు చెప్పినట్లు ఈ స్టోరీ శర్వానంద్ దగ్గరకు రాకపోయి ఉంటే రవితేజ చేసేవాడా లేదా అన్నది పక్కన పెడితే… సినిమా ప్లాప్ తో మాత్రం రవితేజ తన సమయాన్ని వృధా చేసుకోకండా ఒక ప్లాప్ సినిమాను తన ఖాతా నుంచి తప్పించుకున్నాడని చెప్పుకోవచ్చు. ఇక నిన్న “రణరంగం” సినిమాతో పాటు విడుదలైన అడవి శేష్ “ఎవరు” సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో “రణరంగం” సినిమా పరిస్థితి మరింత దీన స్థితిలోకి నెట్టివేయపడడటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ నాలుగు రోజులు సినిమా కాస్త సెలవులు దొరకడంతో సినిమా కలెక్షన్స్ కాస్త బాగున్నా వచ్చే సోమవారం నుంచి పరిస్థితి దారుణంగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

  •  
  •  
  •  
  •  
  •  
  •