శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా రానున్న “రణరంగం” సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో మంచి హైప్ ఏర్పడింది. శర్వా ఈ సినిమాలో యంగ్ క్యారెక్టర్ తో పాటు… 40 ఏళ్ళ మిడిల్ ఏజ్ వాడిగా ఒక మాస్ లుక్ లో నటించనుండటంతో సినిమాలో ఏదో మ్యాజిక్ ఉందని భావిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి మనకు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి తెలుస్తుంది. ఈ సినిమాను సుధీర్ వర్మ మొదటగా హీరో రవితేజను అప్రోచ్ అయ్యాడట. రవితేజకు ఈ సినిమా నచ్చడంతో సినిమా చేయడానికి ఇంట్రెస్టింగ్ చూపించాడట. ఆ తరువాత ఈ సినిమాను శర్వానంద్ కు వినిపించడంతో శర్వానంద ఈ సినిమా తాను చేయడానికి రెడీ అని… తనకు బాగా నచ్చిందని చెప్పడంతో… డైరెక్టర్ సుధీర్ వర్మ ఇప్పటికే ఈ స్టోరీ హీరో రవితేజకు చెప్పడం జరిగిందని… అతను ఈ ప్రాజెక్ట్ లో నటించడానికి ఒప్పుకున్నాడని చెప్పాడట.

కానీ శర్వానంద్ మాత్రం రవితేజను ఎలాగైనా ఒప్పించి ఈ ప్రాజెక్ట్ లో నేను నటించాలని అనుకోవడం రవితేజను రిక్వెస్ట్ చేయగా ఈ సినిమాను తాను వదులుకొని శర్వానంద్ కు ఇచ్చేశాడట. ఇక రవితేజ వదులుకొని అంతలా ఇష్టపడిన శర్వానంద్ కు ఈ సినిమా ఎంతవరకు హాపీ అవుతుందో… ఏమాత్రం విజయం సాధిస్తుందో చూడాలి. మంచి టెస్ట్ ఉన్న హీరోలలో శర్వానంద్ కూడా ఒకడు… తన జడ్జిమెంట్ కొన్ని సార్లు ఫెయిల్ అయినా… ఎక్కువ సార్లు హిట్ బాటనే పట్టాడు. చూద్దాం ఈ సినిమా ఎంతలా మెప్పిస్తుందో

  •  
  •  
  •  
  •  
  •  
  •