జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈమధ్య ఒక మీటింగ్ లో మాట్లాడుతూ రాపాక వరప్రసాద్ జనసేన పార్టీలో ఉన్నారో లేదో తనకు తెలియదని, అతడి వైఖరి ఏమిటో స్పష్టంగా తెలియడం లేదని చేసిన వ్యాఖ్యలు కాస్త దుమారాన్ని రేపాయి. జనసేన పార్టీ మూడు రాజధానులు వ్యతిరేకంగా ఉంటే రాపాక మాత్రం అసెంబ్లీలో మూడు రాజధానులు అనుకూలమని మాట్లాడటంతో పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడి ఉండవచ్చు.

ఈరోజు తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం పవన్ కళ్యాణ్ ను తాను ఈమధ్య కలవలేదని, తాను జనసేన పార్టీలోనే ఉన్నానని, ప్రభుత్వ విధానాలు నచ్చితే మద్దతు తెలుయచేస్తానని, అభివృద్ధి వికేంద్రీకరణకు తాను మద్దతు ఇస్తున్నానని, విశాఖపట్నం రాజధానిగా ఉంటే వెనుకబడిన గోదావరి జిల్లాలు అభివృద్ధి చెందుతాయని చెప్పుకొచ్చారు.

కానీ రాపాక వరప్రసాద్ మాత్రం ఎప్పుడు వైసీపీ నాయకులతో పాటు ముఖ్యమంత్రి జగన్ తో కూడా దగ్గర సంబంధాలు ఉన్నట్లు కొన్ని బయటపడ్డాయి. సంక్రాంతి సందర్భంగా గుడివాడ వెళ్లి మంత్రిగా కొడాలి నానితో కలసి ఎడ్ల పందేలలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో జనసేన సైనికులు రాపాకపై ఆగ్రహం వ్యక్తం చేసినా వెనక్కు తగ్గలేదు. మరొకసారి ఏకంగా సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తన స్వామి భక్తిని చాటుకున్నారు. రాపాక వరప్రసాద్ మాత్రం తనతో పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎలాంటి విషయాలు చర్చించడని అసలు పార్టీ వైఖరిపై ఏదైనా విషయం తనతో చర్చిస్తే అసెంబ్లీలో జనసేన పార్టీ విధివిధానమేమిటో తెలుస్తుందని చెప్పుకొచ్చారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •