సినిమాలలో అవకాశాల కోసం ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు తనకు ఓ విచిత్రమైన సంఘటన జరిగిందని చెప్పింది బాలీవుడ్ నటి మాన్వి గాగ్రు. తాజాగా మాన్వి ఓ ఆంగ్ల మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు.

గతంలో ఓ సినిమాలో అవకాశం కోసం ఆడిషన్స్ కి వెళ్లానని.. చూడడానికే ఆ ఆఫీస్ చాలా ఛండాలంగా ఉందని.. ఆ ఆడిషన్స్ లో భాగంగా రేప్ సీన్ లో నటించమని అడిగారని చెప్పింది. అయితే ఆ గదిలో మంచం కూడా వేసుందని.. అక్కడ కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారని… నాకు చాలా భయం వేసి పారిపోయి వచ్చానని చెప్పింది. దానిని వాళ్ళు ఆఫీస్ అని చెప్పుకోవడం విచిత్రంగా ఉందని చెప్పుకొచ్చింది మాన్వి.

ఇక మాన్వి 2007లో టెలివిజన్ షో ‘ధూమ్ మచావో ధూమ్’తో కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత అనేక సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ‘శుబ్ మంగళ్ జ్యదా సావదాన్’ సినిమాలో నటిస్తున్నారు.