డబ్బింగ్ అనేది ఒక కల, అవును ప్రతి సినిమా ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్టులకు కొదవ లేదు. మంచి వాక్ చాతుర్యం, వినసొంపైన వాయిస్ ఉంటే చాలు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మీరు పుష్కలంగా ఎంపిక కావచ్చు. ఇక తెలుగు సినిమాలలో నటించే అందమైన ఉత్తరాది భామలకు తెలుగు భాషపై పట్టు లేకపోవడంతో వారికి డబ్బింగ్ ఆర్టిస్టుల చేత
వాయిస్ ఓవర్ చెప్పిస్తారు. కానీ కొంత మంది హీరోయిన్స్ తెలుగు ఇండస్ట్రీపై పట్టు సాధించిన తరువాత తెలుగు చక్కగా నేర్చుకొని వారే డబ్బింగ్ స్వయంగా చెప్పుకొంటూ అరువు గొంతుకు ఫుల్ స్టాప్ పెడతారు.

ఇప్పుడు ఆ కోవలోకే గ్లామరస్ డాల్ రాశి ఖన్నా కూడా చేరినట్లు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్సకత్వంలో నిర్మితమవుతున్న”వరల్డ్ ఫేమస్ హారో” సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ సందర్భంలో ఆమె చక్కగా తెలుగు మాట్లాడటం చూసి దర్శకుడు క్రాంతి మాధవ్ ప్రోత్సహించడంతో ఇప్పుడు తన వాయిస్ తానే మొదటి సారి డబ్బింగ్ చెప్పుకుంటూ చాల థ్రిల్ కు గురవుతుందట. దీని గురించి చెబుతూ డబ్బింగ్ అనేది ఒక కల అని, దానిని మనస్సు పెట్టి సరిగ్గా డబ్బింగ్ చెప్పగలిగితే మంచి రిజల్ట్ సాధించవచ్చని చెప్పుకొస్తుంది. రాశి ఖన్నా తన వాయిస్ తో ఎంతమంది కుర్ర హీరోలను ఫిదా చేసి మరిన్ని మంచి మంచి చిత్రాల ఆఫర్లు కొట్టేస్తుందేమో చూద్దాం.