టాప్ హీరోయిన్ రష్మిక మందన్నకు ఓ అభిమాని ముద్దుపెట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘సరిలేరు నీకెవ్వరు’ తరువాత రష్మిక మందన్న నటిస్తున్న తాజా సినిమా ‘బీష్మ’. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా పిబ్రవరి 21న విడుదల కాబోతోంది. అయితే మొన్న ఓ కార్యక్రమానికి హాజరైన రష్మికను చూసేందుకు అభిమానులు భారీగా వచ్చారు. అక్కడ కొంత మంది అభిమానులతో రష్మిక సెల్పీలు దిగింది. మరి కొందరు ఆమెతో సెల్ఫీలు దిగడానికి ప్రయత్నించారు.

అయితే ఓ అభిమాని ఆమెతో సెల్ఫీ దిగి ఆ వెంటనే ముద్దు పెట్టి పరారయ్యాడు. అతనిని అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది పట్టుకోవడానికి ప్రయత్నించినా కూడా దొరకకుండా పారిపోయాడు. ఈ ఘటనపై రష్మిక పోలీసులకు పిర్యాదు చేసింది. ఇక రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్-సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలతో బిజీగా ఉంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •