రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకున్నారు. ఇక మరో హీరోయిన్ గా రష్మికను తీసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ సినిమా మరింత క్రేజి ప్రాజెక్ట్ గా మారిపోయిందని చెప్పవచ్చు. దీనిపై త్వరలోనే చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించబోతున్నారట.

ఇక ఈ సినిమా కథను భారీ మొత్తానికి కొనుగోలు చేసాడట. హైదరాబాద్ లోని ఓ ఆడియో కంపెనీలో పని చేస్తున్న మేనేజర్ వద్ద ఈ కథను నాని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. నానికి ఈ కథ అద్భుతంగా నచ్చడంతో భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసాడని తెలుస్తుంది. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించబోతున్నారు.

బిర్యానీ కోసం ఏకంగా గుడిలో హుండినే పగలగొట్టారు..!

భార్యను కొట్టడంతో కొలువు పోగొట్టుకున్నాడు.. వీడియో వైరల్..!