కన్నడ సినిమా ‘కిరాక్ పార్టీ’ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రష్మిక మందన్న.. తెలుగులో ‘చలో’ సినిమా ద్వారా పరిచయమైంది. ఆ సినిమా మంచి హిట్ కావడంతో వరుసగా సినిమా అవకాశాలను సాధించింది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్, దేవదాస్, సరిలేరు నీకెవ్వరూ వంటి సినిమాల ద్వారా మంచి పేరు తెచ్చుకుని భారీ ఆఫర్లతో దూసుకుపోతుంది.

ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ ఉంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే రష్మిక.. ట్విట్టర్ వేదికగా నెటిజన్లను భవిష్యత్తులో తానూ ఎలాంటి పాత్రలు చేస్తే చూడాలనుకుంటున్నారని ప్రశ్నించింది.

ఇక దీంతో కొందరు నెటిజన్లు ‘డియర్ కామ్రేడ్’ లో నటించిన పాత్రలోనే చూడాలనుకుంటున్నామని సమాధానం ఇవ్వగా, మరో నెటిజన్ హర్రర్ సినిమాలో నటించండి అని సమాధానం ఇచ్చాడు. అలాగే మరో అభిమాని మీరు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో సమంత నటించిన క్యూట్ పాత్రలో నటిస్తే బాగుంటుందని సమాధానం ఇచ్చాడు.

భారత్ లో ఉగ్రరూపం దాల్చుతున్న కరోనా వైరస్.. కేవలం 15 రోజుల్లోనే లక్ష పాజిటివ్ కేసులు..!

సచివాలయంలో 8 మందికి కరోనా రావడంతో తీవ్ర కలకలం..!