ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర ప్రతాపం చూపుతున్న సమయంలో రష్యా దేశం కరోనాకు వ్యాక్సిన్ విడుదల చేసి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే రష్యా విడుదల చేసిన వ్యాక్సిన్ పై పలు దేశాల నిపుణులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. అయితే రష్యా వ్యాక్సిన్ గురించి ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ కీలక వ్యాఖ్యలు చేసింది. రష్యా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ వి’తో శరీర యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడించింది.

అయితే ఇప్పడు రష్యా వ్యాక్సిన్ ఫార్మా దిగ్గజం ‘డాక్టర్ రెడ్డీస్’ చేతికి వచ్చింది. ‘స్పుత్నిక్ వి’ పై దేశీయంగా మూడవదశ క్లినికల్ పరీక్షలు నిర్వహించేందుకు డాక్టర్ రెడ్డీస్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు రష్యా సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌ ఆర్‌డీఐఎఫ్ తాజాగా పేర్కొంది. తద్వారా దేశీయంగా డాక్టర్ రెడ్డీస్ మూడవదశ క్లినికల్ పరీక్షలను చేపట్టనున్నట్లు తెలియచేసింది. తాజాగా కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా 10 కోట్ల డోసేజిలను డాక్టర్ రెడ్డీస్ కు సరఫరా చేయనున్నట్లు తెలియచేసింది.

ఇక రష్యాలో తొలి రెండు దశల క్లినికల్ పరీక్షలు సఫలం అయ్యాయని దేశీయ ప్రమాణాల ప్రకారం మూడవదశ పరీక్షలకు రెడ్డీస్ తో ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. ఇక ఇది విజయవంతమైతే నవంబర్ లోనే వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది.

మూగ అమ్మాయిగా సమంత..!

‘సర్కార్ వారి పాట’.. కీలక పాత్రలో విద్యాబాలన్..!