ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను తీవ్ర భ్రాంతులకు గురిచేస్తున్న సమయంలో రష్యా కరోనా వ్యాక్సిన్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రష్యా వ్యాక్సిన్ కు మూడవదశ పరీక్షలు జరుగుతున్నాయి. మాస్కోలో మూడవదశ పరీక్షల్లో పాల్గొనేందుకు 60 వేల మందికి పైగా వాలంటీర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే ఇప్పటికే 3000 మందికి పైగా వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్ ఇవ్వగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని రష్యా సోమవారం ప్రకటించింది.

తాజాగా వ్యాక్సిన్ తీసుకున్న వారి ఆరోగ్యం బాగా ఉందని.. మాస్కో మేయర్‌ సెర్జీ సోబ్యనిన్ పేర్కొన్నారు. తాను చాలా రోజుల కిందట వ్యాక్సిన్ వేయించుకున్నానని తనకేమి కాలేదని ఆయన చెప్పారు. మరోవైపు రష్యా వ్యాక్సిన్‌పై భారత్‌లో మానవ పరీక్షలు, సరఫరాల కోసం ఆర్‌డీఐఎఫ్‌, రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ మధ్య ఒప్పందం కుదిరింది. పరీక్షలు విజయవంతమై సంబంధిత అనుమతులు లభిస్తే ఏడాది చివరినాటికి భారత్‌లో వ్యాక్సిన్‌ సరఫరాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆర్‌డీఐఎఫ్‌ పేర్కొంది.

బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ.. గొడవపడ్డ నోయెల్, లాస్య..!

ఎస్పీ బాలసుబ్రమణ్యంకు భారతరత్న ఇవ్వండి.. మోదీకి సీఎం జగన్ లేఖ..!

అఫీషియల్.. విజయ్ దేవరకొండ-సుకుమార్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ..!