హీరో రవితేజ గత కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘డిస్కో రాజా’. ఐవి ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. త్వరలో కీలకమైన పార్ట్శ్ కోసం ఢిల్లీ వెళ్ళనున్నారు చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాను మొదట దసరాకు విడుదల చేయాలనీ భావించారు. కానీ ఆ టైం లోపు పూర్తి చేసి ఫస్ట్ కాపీ రెడీ చేసే వీలు లేకపోవడంతో సినిమాను డిసెంబర్ 20 కి వాయిదా వేశారు.

ఈ సినిమా తేదీనే మరో రెండు మూడు సినిమాలు విడుదల అవడానికి రెడీ అవుతున్నాయి. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో చేస్తున్న సినిమా అలానే మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా కూడా అదే తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది.
  •  
  •  
  •  
  •  
  •  
  •