బిగ్ బాస్ హౌస్ మొత్తం మీద వెరీ వెరీ గుడ్ బాయ్ ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చేది సీరియల్ యాక్టర్ కమ్ స్మార్ట్ బాయ్ రవి కృష్ణ. రెండవ వారం షోలోకి అడుగుపెట్టిన తమన్నా సింహాద్రికి కార్నర్ గా మారి బిగ్ బాస్ ప్రేక్షకుల చేత అయ్యో పాపం అనిపించుకున్నాడు. ఆ తరువాత తమన్నా సింహాద్రిని రవిక్రిష్ణను చాల హింసించిందని కోపంతో ప్రేక్షకులు ఎలిమినేషన్ చేసి పడేశారు.

తనకు ప్రేక్షకులలో వచ్చిన సింపతిని ఉపయోగించుకోకుండా ఎంతసేపటికి షోలో గుడ్ బాయ్ లా ఉంటానంటే ప్రేక్షకులకు కూడా విసుగుతెప్పించినట్లుంది. గేమ్ ఆడకుండా ఈ గుడ్ బాయ్ ఆటలేమిటిరా అన్నట్లు… ఇంత గుడ్ బాయ్ లా హౌస్ లో మెలగడం కష్టమే అని ఈ వారం బయటకు సాగనంపారు. మొన్న షోలోకి అడుగుపెట్టిన రవికృష్ణ ఫ్రెండ్ అలీ రేజకు కూడా ఈ విషయం ముందే అర్ధమైనట్లు ఉంది.

నిన్న కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా ఈ వారానికి రవిక్రిష్ణను కెప్టెన్ చేద్దామని, కనీసం హౌస్ లో రెండు రోజులైనా కెప్టెన్ గా ఉండి బయటకు వెళ్తాడని అన్నాడు. కానీ వితిక… రవికృష్ణ కలర్ బౌల్ నెట్టేయడంతో ఈవారం శ్రీముఖి ఇంటి కెప్టెన్ గా నామినేట్ అయింది. ఈవారం ఎలిమినేషన్ లో ఉన్న నలుగురు ఇంటి సభ్యులలో రవికృష్ణ ఒక్కడే వీక్ కావడంతో ప్రేక్షకులు కూడా చలో రవికృష్ణ అని గుడ్ బాయ్ కు… బై బై చెప్పేసారు. నిజంగా ప్రేక్షకులు చలో అన్నారో లేదో… రేపు సాయంత్రం వచ్చే ప్రోగ్రాం తో తేలనుంది. ఓటింగ్ పరంగా అయితే రవికృష్ణ చాలా వీక్ గా ఉన్నాడు.