మహేంద్ర సింగ్ ధోని ప్రపంచ కప్ ముగిసిన తరువాత భారత్ ఆర్మీకి సేవ చేయాలనీ 45 రోజుల పాటు క్రికెట్ కు దూరంగా జరిగి జమ్మూ/కాశ్మీర్ బోర్డర్ లో సేవ చేసి ఆగస్ట్ 15న అక్కడి నుంచి వచ్చేసాడు. ఇక అప్పట్లో విండీస్ టూర్ కు ధోనిని సెలక్టర్లు పక్కన పెట్టారు. ఇప్పుడు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లకు కూడా పక్కన పెట్టారు. దానికి కారణం చెబుతూ అతడు ఇంకా తమకు అందుబాటులోకి రాలేదని చెబుతున్నారు. దీనిపై ఇంత వరకు ధోని కూడా స్పందించలేదు.

ధోని గురించి టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ అతడు తిరిగి జట్టులోకి రావాలని అనుకుంటున్నాడా లేదా అన్నది నిర్ణయించుకోవాలి. ధోని భవిష్యత్ గురించి తనకు తెలియదని, ప్రపంచకప్ ముగిసిన తరువాత అతడిని తాను కలవలేదని, అతడు ముందు ఆటపై దృష్టి పెట్టాలని, అతడు గ్రౌండ్ లో ప్రాక్టీస్ తిరిగి మొదలుపెడితే టీమిండియాలో చోటు గురించి ఆలోచించవచ్చనట్లు మాట్లాడారు. ధోని ఒక గొప్ప ఆటగాడని, దానిలో ఎటువంటి సందేహం లేదని రవిశాస్త్రి తెలియచేసాడు.