తెలుగుదేశం మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ప్రసంశలు కురిపించారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ పరిపాలన చాలా బాగుందన్నారు. ఈ రెండు నెలల కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాలు పథకం చాలా బాగుందని.. అయితే ఆ పధకానికి నిధుల కొరత ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏపీకి సహకరించటలేదన్న రాయపాటి.. తాను ఏ పార్టీలో చేరేది త్వరలోనే చెబుతానన్నారు. బీజేపీ రాష్ట్రంలో పాగా వెయ్యాలని చూస్తుందని.. కానీ అదే సాధ్యం అయ్యే పని కాదన్నారు. పోలవరం ప్రాజెక్టుకి నూతన టెండర్లు పిలవడం వల్ల వ్యయం పెరుగుతుందని రాయపాటి అన్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •