ఆర్‌బీఐ చేసిన ప్రకటనతో మర్కెట్స్ కుప్పకూలాయి. ఓ వైపు చమురు, మరో వైపు రూపాయి పతనంతో స్టాక్ మార్కెట్స్ కుప్పకూలాయి. సెన్సెక్స్ 792 నిఫ్టీ 283 పాయింట్స్ కుప్పకూలాయి. రూపాయి సైతం ఆర్‌బీఐ ప్రకటన తర్వాత కనిష్ట స్థాయి 74 ను తాకింది. ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ అధ్యక్షతన శుక్రవారం ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా రేపో, రివర్స్ ‌రేపో రేటులను వరుసగా 6.5శాతం, 6.25శాతంగా యథాపూర్వక స్థితిని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో మార్కెట్లు భారీ నష్టాల్లోకి కూరుకుపోయాయి. ఓ దశలో సెన్సెక్స్‌ 900 పాయింట్ల నష్టపోగా, నిఫ్టీ 10,300 పాయింట్లకు దిగువన ట్రేడింగ్‌ను కొనసాగించింది. చివరకు సెన్సెక్స్‌ 792.17 పాయింట్లు నష్టపోయి 34,376 వద్ద ముగిసింది. నిఫ్టీ ఏకంగా 282 పాయింట్ల నష్టంతో 10,316 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది.