దృష్టి లోపం ఉన్నవారు కూడా కరెన్సీ నోట్లను సులభంగా గుర్తించేందుకు వీలుగా రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా మొబైల్ యాప్ ను రూపొందిస్తుంది. ఈ యాప్ కు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అవసరం లేదని ఆర్బీఐ బొంబాయి హైకోర్టు కు తెలియచేసింది. ఈ యాప్ కోసం 16 కంపెనీలు పోటీ పడగా చివరకు రఫడోల్ అనే సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఈ యాప్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకున్న తరువాత మొబైల్ కెమెరా ముందు ఉంచితే అది ఎంత మొత్తం నోటు అనేది తెలియచేస్తుందని తెలియచేసారు. అంధులకు ఉన్న ఇబ్బందులు ఈ యాప్ తో కాస్తయినా తగ్గుతాయని ఆర్బీఐ అధికారులు తెలియచేస్తున్నారు. ఈ యాప్ అతి త్వరలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •