సోమవారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగుళూర్ జట్టు విజయాన్ని సాధించింది. అయితే మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ ద్వారా ఆర్సీబీ విజయం సాధించింది. తోలుతూ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 201 పరుగులు చేసింది. డివిలియర్స్ 24 బంతుల్లో 4 పొర్లు, నాలుగు సిక్స్ లతో 55 పరుగులు చేసాడు. అలాగే అరోన్‌ ఫించ్ 35 బంతుల్లో 52 పరుగులు, దేవదూత్‌ పడిక్కల్ 40 బంతుల్లో 54 పరుగులతో రాణించారు.

ఇక 202 పరుగుల లక్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్ 58 బంతుల్లో 99 పరుగులు, పోలార్డ్ 24 బంతుల్లో 60 పరుగులు చేశారు. ఇక దీంతో మ్యాచ్ టై గా ముగిసింది. దీంతో సూపర్ ఓవర్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు కేవలం 7 పరుగులు మాత్రమే చేసింది. ఆ తరువాత బరిలోకి దిగిన ఆర్సీబీ.. 8 పరుగుల లక్యాన్ని సాధించడంతో ఆర్సీబీ విజయం సాధించింది.