జాఫర్ ప్రతి వారం టీవీ9 లో వచ్చే “ముఖా ముఖి” ప్రోగ్రాంతో పొలిటీషియన్స్, సినీ తారలకు సంబంధించిన అంతరంగాన్ని ఆవిష్కరించే పనిలో భాగంగా నిక్కచ్చిగా ప్రశ్నలు అడుగుతూ, వారి చేత ఒక్కోసారి బండబూతులు తింటించుకుంటూ ఉంటాడు. ఐన జాఫర్ ఏ మాత్రం తగ్గకుండా తాను అడగాలనుకున్న ప్రశ్నలు అడిగి ప్రజల ముందు వారి అంతరంగాన్ని చూపించే పని చేస్తాడు. కొంత మంది నాయకులైతే ఆమ్మో జాఫర్ ఇంటర్వ్యూనా మా వాళ్ళ కాదు అంటారు. అలాంటి జాఫర్ బిగ్ బాస్ హౌస్ కు వెళుతున్నాడంటే అందరూ ఆశ్చర్య పోయారు.

జాఫర్ ఏమిటి బిగ్ బాస్ హౌస్ కు వెళ్లడం ఏమిటి అని..! ఎందుకంటే జాఫర్ కున్న యాటిట్యూడ్ అతను చేసే ఇంటర్వ్యూ లు చూసే ఎవరైనా అసలు జాఫర్ బిగ్ బాస్ హౌస్ లో మెలగగలడా… వారితో కలసి ఆడి పాడ గలడా అనుకున్నారు. కానీ రెండు వారాలు దిగ్విజయంగా ముగించుకొని ఈ వారం ఎలిమినేట్ అయ్యాడు. ఇక జాఫర్ ఎలిమినేటైన సమయంలో ఒక్క మాట అన్నాడు. బిగ్ బాస్ హౌస్ కు వెళ్ళేటప్పుడు ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఆ స్క్రిప్ట్ లో భాగంగా భావోద్వేగాలను పలికిస్తారనుకున్నానని కానీ తాను బిగ్ బాస్ హౌస్ కు వెళ్లిన తరువాత తాను పరిశీలించిన దాని ప్రకారం ఎలాంటి స్క్రిప్ట్ ఉండదని అంతా న్యాచురల్ గానే నటిస్తారని అన్నారు.

అంటే ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లో ఏదో జరుగుతుందని తెలుసుకోవడానికి జాఫర్ ఇలా కావాలనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడా అన్నట్లు ఉంది. జాఫర్ ఎప్పుడైనా తాను ఇంటర్వ్యూలు చేసేటప్పుడు డాక్యుమెంట్ ప్రూఫ్స్ తో సహా వచ్చి, ఎవరైనా అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తే ప్రూఫ్స్ చూపించి వారి నోరు మూయిస్తాడు. అలానే తనకు కూడా బిగ్ బాస్ హౌస్ లో ఏమి జరుగుతుందో అంతు పట్టకపోవడంతో ఇలా బిగ్ బాస్ కథ తేలవడానికి వెళ్లాడా అన్నట్లు ఉంది. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి జాఫర్ ఎలా వెళ్లినా… ఎందుకు వెళ్లినా… తాను రీసెర్చ్ చేసుకోవడానికి వెళ్లినా… జాఫర్ కూడా బాబా భాస్కర్ మాస్టర్ తో కలసి చేసిన సరదా సరదా డాన్స్ లు, జాఫర్ ఇంటర్వ్యూ లు మెచ్చే వారిని తప్పకుండా ఆకట్టుకున్నాయనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. 

ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడంతో మొదటి వారం ఎలిమినేట్ అయిన హేమ వలే బిగ్ బాస్ యాజమాన్యంపై ఏమైనా కామెంట్స్ చేస్తాడా లేక తన “ముఖా ముఖి” కార్యక్రమంతో బిజీ అయిపోతాడో చూడాలి. మొత్తానికైతే జాఫర్ ఇచ్చిన క్లారిటీతో ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లో చేసే ఓవర్ యాక్టింగ్… ఒక్కోసారి ఏడుపులు, పెడబొబ్బలు అన్ని నాటకం అనుకునే వారికి… సినిమాలలో నటించేవారికి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుందని వారు చేసేది నటనలో భాగం కాదని ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చాడు.

 
  •  
  •  
  •  
  •  
  •  
  •