సుజిత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ సినిమా ‘సాహో’. గత ఏడాది విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కాగా తెలుగు వెర్షన్ లో కంటే హిందీలోనే ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందింది. ఇక ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫారం మీద రికార్డులు సృష్టించింది.

అత్యధిక టిఆర్పి సాధించిన టెలివిజన్ ప్రీమియర్ గా ‘సాహో’ అదరగొడుతుంది. జనవరి 26న ప్రచారమైన ఈ సినిమా హిందీ వెర్సన్ కు 128.20 లక్షల వ్యూవర్షిప్ వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో గత చిత్రాలైన సింబా, కేజీఎఫ్ చాప్టర్ 1 , కాలికా కా కరిష్మా వంటి చిత్ర రికార్డులను బద్దలు కొట్టింది.

  •  
  •  
  •  
  •  
  •  
  •