రెజీనా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మంచి సినిమాలలో నటించినా తరువాత సినిమా సెలక్షన్ లో ఫెయిల్ అవ్వడంతో ఒకరకంగా తెలుగు ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని ముగించుకుంది. అలాంటి సమయంలో అడవి శేష్ హీరోగా రామ్ జీ డైరెక్షన్ లో వచ్చిన “ఎవరు” సినిమా పెద్ద మలుపని చెప్పుకోవచ్చు. “ఎవరు” సినిమా మొత్తం రెజీనా చుట్టూ తిరగడంతో పాటు, అద్భుతమైన నటనతో అబ్బురపరించింది.

ఈరోజులలో సినిమాలో హీరోయిన్ అంటే నాలుగు పాటలు, మూడు రొమాన్స్ లు అనుకుంటున్న సమయంలో రెజీనాకు దొరికిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంది. సినిమాలో తన హావభావాలు పలికించడంతో పాటు, ఫ్రెష్ గా కనపడటంతో తెలుగు ఇండస్ట్రీలో మరోసారి రెజీనా కోసం కథలు రెడీగా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా విడుదలకు ముందు “ఎవరు” సినిమాతో మరోసారి తన హావ తెలుగు ఇండస్ట్రీలో కొనసాగిస్తానని చెప్పిన రెజీనా చెప్పినట్లుగానే మరికొన్నాళ్లు ఒక వెలుగు వెలగనుంది. రెజీనాకు ఎలాంటి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీ మరోసారి ఘనంగా ఆహ్వానిస్తుందో చూద్దాం.

  •  
  •  
  •  
  •  
  •  
  •