తన మేనమామ వెంకటేష్ తో కలసి నాగచైతన్య నటిస్తున్న సినిమా ‘వెంకిమామ’. ఈ సినిమా డిసెంబర్ 13న వెంకటేష్ బర్త్ డే కానుకగా విడుదల కానుంది. ఇక ఈ సినిమాతో పాటు శేఖర్ కమ్ముల సినిమాలో కూడా నటిస్తున్నాడు చైతు. ఈ సినిమాలో చైతు సరసన ‘ఫిదా’ భామ సాయి పల్లవి నటిస్తుంది. డాన్స్ బేస్డ్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాను మొదట ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్నికారణాల వల్ల ఈ సినిమాను ఏప్రిల్ 2 న విడదల చేయబోతున్నారట.

ఇక ఈ సినిమాకు ‘లవ్ స్టోరీ’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో తెలంగాణ కుర్రాడిగా చైతు నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను ఏషియన్ మూవీస్ పతాకంపై నారాయణ దాస్ నారంగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు అనేక సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ఏషియన్ మూవీస్.. ఈ సినిమా ద్వారా నిర్మాణ రంగంలోకి వచ్చింది.

  •  
  •  
  •  
  •  
  •  
  •