లాక్ డౌన్ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలు కుదేలైపోయాయి. దీనితో ఉద్యోగాలు కోల్పోతుండటంతో రోజు రోజుకి నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుండటమే తప్ప తగ్గడం లేదు. మన దేశంలో ఇంకా బయటకు రావడం లేదుగాని చిన్నా, చితక ఉద్యోగాలు చేసుకునే వారిని అర్ధాంతరంగా ఇంటికి పంపించివేయడంతో వారికి దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. దీనితో ఉద్యోగాలు కోల్పోయి ప్రభుత్వాలు ఆదుకోకపోవడంతో మధ్యతరగతి వారు పేద వారిగా… పేద వారు కటికి పేద వారుగా దిగజారిపోతున్నారు.

తాజాగా ప్రముఖ కార్ల కంపెనీ రెనాల్ట్స్ రోజంత ఏకంగా 15 వేల మందిని ఉద్యోగంలో నుంచి తొలగించడంతో వారంతా ఇప్పుడు రోడ్డున పడ్డారు. లాక్ డౌన్ కారణంతో కార్ల పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుండంతో పాటు కార్ల అమ్మకాలు గణనీయంగా తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాలు పోయిన వారిలో ఫ్రాన్స్ కు చెందిన వారు 4900 మంది ఇతర దేశాల వారు పది వేల మంది ఉన్నట్లు తెలుస్తుంది. రాబోయే రోజులలో 40 లక్షల కార్ల ఉత్పత్తిని 2024 నాటికి 33 లక్షలకు తగ్గించి దాదాపుగా 16500 కోట్ల మేర ఖర్చులు తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

గణపతి శాస్త్రి చేసిన యాగం, సంజయ్ గాంధీ మరణానికి దారి తీసిందా?

కోర్టు తీర్పులపై సీఎం జగన్ అసహనానికి గురవుతున్నారా?