పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన “బద్రి” సినిమాలో రేణు దేశాయ్ హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాతో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో ఆ తరువాత కొద్ది రోజులకు పెళ్లి చేసుకోవడం వారిద్దరికీ ఇద్దరు పిల్లలు పుట్టడం అంతా చకచకా జరిగిపోయాయి. కానీ ఆ తరువాత పవన్ కళ్యాణ్ చెప్పాపెట్టకుండా “తీన్మార్” సినిమాలో క్లబ్ డ్యాన్సర్ గా చేసిన అన్న లెజినోవాను పెళ్లి చేసుకోవడంతో రేణు దేశాయ్ ఆగ్రహంతో పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకుంది.

అప్పటి నుంచి తన సొంత ప్రాంతమైన పూణేలో నివాసముంటుంది. ఇప్పుడు ఆమె కొడుకు అకీరాను సినిమాలలోకి తీసుకురావాలని తలచి హైదరాబాద్ లో సెటిల్ అవ్వాలని అనుకుని గచ్చిబౌలిలో ఐదు కోట్ల రూపాయలతో ఇల్లు కొనుకుంది. కానీ ఈ ఇంటిని పవన్ కళ్యాణ్ కొనిచ్చాడని పుకారు పుట్టించడంతో ఇప్పుడు రేణు దేశాయ్ ఫైర్ అవుతుంది. తాను పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తరువాత అతడి నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించలేదని, తన కష్టార్జితంతో సంపాదించిన సొమ్ముతో ఇల్లు కొనుకున్నానని చెప్పుకొచ్చింది.

తన తండ్రి సంపాదించిన స్థాయిపై కూడా తాను అదరపడలేదని, కానీ ఇలా లేని పోనీ తప్పుడు వార్తలు కల్పించి తన మనస్సును మరింత కాల్చి వేస్తుందని, పవన్ కళ్యాణ్ తో తనకు ఎటువంటి సంబంధం లేదని, తన కొడుకులను తన పిల్లలను పెంచాను తప్ప పవన్ కళ్యాణ్ పిల్లలులా పెంచలేదని గతంలో చెప్పిన విషయం తెలిసిందే. కానీ ప్రాతిసారి పవన్ కళ్యాణ్ అభిమానులు రేణు దేశాయ్ ను పవన్ తో ముడిపెట్టి వ్యాఖ్యలు చేయడంతో ఆమె పవన్ కళ్యాణ్ పై అసహనం వ్యక్తం చేస్తూ తన ఫాన్స్ ను కంట్రోల్ చేసుకోవాలని చెప్పుకొస్తుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •