పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తరువాత రేణుదేశాయ్ తన పిల్లలతో కలసి పుణేలో నివాసముంటుంది. రేణు దేశాయ్ – పవన్ కళ్యాణ్ కు కలసి పుట్టిన అకిరా సెలవులలో హైదరాబాద్ వచ్చి పవన్ కళ్యాణ్ దగ్గర కొన్ని రోజులు గడిపి వెళ్తాడు. పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తరువాత ఒంటరి జీవితంతో విసుగు చెందిందో లేక తోడు కోరుకుందో పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

బద్రి, జానీ సినిమాల తరువాత రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటుంది. కొన్ని రోజులు పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్ వ్యవహారాలను సైతం రేణు దేశాయ్ చూసుకొంది. ఇప్పుడు మరలా సినిమాలలోకి రీఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు చేసుకుంటుంది. గత సంవత్సరం రేణు దేశాయ్ ఒక సినిమాను సైతం నిర్మించింది. కొన్ని రియాల్టీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నా అని చెప్పిన రేణు దేశాయ్ పెళ్ళికి ముందు సినిమాలో నటిస్తుందా? పెళ్లి తరువాత అనేది క్లారిటీ లేదు. త్వరలో ఈ విషయాలు కూడా రేణు దేశాయ్ చెప్పి అభిమానులకు పూర్తి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Tags : Renu Desai, Renu Desai Engagement, Pawan Kalyan Wife Renu Desai, Renu Desai Movies, Tollywood