పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టింది. హీరోయిన్ గా, క్యాస్టూమ్ డిజైనర్, డైరెక్టర్, రచయిత్రి గా చేసిన రేణు దేశాయ్.. తానూ అందరిలాంటి ఆడదాన్ని కాదని.. ఎంతో మంది దృష్టిలో నేను సింగిల్ పేరెంట్‌ని, ఒంటరి మహిళను అని పేర్కొంది. పురుషుల ప్రపంచంలో తాను అనుకున్నట్లుగా తాను నిబంధనలపై జీవించే స్త్రీనని.. భర్త మద్దతు లేకుండా తన పిల్లలను సంపూర్ణంగా పెంచుకునే తల్లినని పేర్కొంది. తన కాళ్ళ మీద తానూ నిలబడి వ్యాపారం చేసుకుని.. ఆర్ధికంగా బలపడగలిగే సామర్థ్యం ఉన్న మహిళనని పేర్కొంది.

అలాగే స్వతంత్ర ఆలోచనలతో బ్రతకాలనుకునే యంగ్ గర్ల్స్ కు నేను చెప్పేది ఒకటే. వేరొకరి కుమార్తెగా లేదా భార్యగా ఉండటం మీకు అసలైన గుర్తింపు కాదు. మీ లైఫ్‌లో మీరే ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. అలాగని సాంప్రదాయ విలువలను అగౌరవ పరచడం స్త్రీ వాదం కాదు. కుటుంబ సంప్రదాయాల ముసుగులో శతాబ్దాలుగా జరుగుతున్న అన్యాయానికి అండగా నిలబడటమే స్త్రీ వాదం అని రేణు దేశాయ్ పోస్ట్ చేసింది. ఇక దీనిపై నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

renudesai post

ఓటీటీలోకి స్టార్ హీరో సినిమా..!

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేకు డబుల్‌ బొనాంజా..!