ఒకప్పటి హీరోయిన్ రేణుదేశాయ్ మళ్ళీ 18 ఏళ్ళ తరువాత ముఖానికి మేకప్ వేసుకుని కెమెరా ముందుకు రాబోతున్నారు. అప్పుడప్పుడు కొన్ని టీవీ షోల్లో కనిపించిన రేణుదేశాయ్.. గతంలోనే కొన్ని సినిమాలలో నటించాలనుకున్న అవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు తాజాగా ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది.

మళ్ళీ కెమెరా ముందుకు రావడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. వచ్చే నెల వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి స్థాయిలో మొదలవుతుంది. ఈ ప్రయాణంలో మీ అందరి ఆశీర్వాదాలు, ప్రేమ నాకు కావాలి. నిజం న్యాయం కోసం పోరాడే ఓ బలమైన మహిళా కథ ఇది అని పోస్ట్ చేసింది రేణుదేశాయ్. ఇక ఎమ్.ఆర్ కృష్ణ మావిడాకుల దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ ను సాయి కృష్ణ ప్రొడక్షన్ బ్యానర్ పై డిఎస్ రావు, ఎస్.రజనీకాంత్ నిర్మిస్తున్నారు.

బ్రేకింగ్.. పార్లమెంట్ లో 8 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు

ఓటిటిలోకి క్రేజి బయోపిక్..!

భార్య రోజు తాగొచ్చి చితకబాదుతుందట

ఈ పుష్పంతో ఏ వ్యాధినైనా నయం చేయవచ్చట..!