రెండేళ్ల క్రితం శ్రీరెడ్డి ఫిల్మ్ క్లబ్ దగ్గర నగ్నంగా హల్ చల్ చేయడం అప్పట్లో పవన్ కళ్యాణ్ పై అనేక ఆరోపణలు చేయడం దీని వెనుక రామ్ గోపాల్ వర్మ ఉన్నాడని తరువాత బహిర్గతం చేయడంతో అప్పట్లో రామ్ గోపాల్ వర్మపై సినీ నిర్మాత మెగా దిగ్గజం అల్లు అరవింద్ గట్టిగానే ఫైర్ అయ్యాడు. తాను తలచుకుంటే నిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని ఇలా అనేక రకాలుగా హెచ్చరికలు చేసినా వర్మ అప్పటి నుంచి అల్లు అరవింద్ పై సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఏకంగా “అల్లు” పేరుతో సినిమా తీస్తూ మరో సంచలనాన్ని రెడీ చేస్తున్నారు.

వర్మ ఒకరిపై పగ పడితే దానిని అంత త్వరగా మర్చిపోడని, కొంచెం లేట్ అయినా మొత్తం వారికి ఇవ్వవలసిన బాకీ తీర్చేస్తాడని, అందులో భాగంగానే చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం సమయంలో జరిగిన విషయాలపై “అల్లు అరవింద్ వెనుక ఉండి నడిపించిన కథపై అతడు సినిమాకు పూనుకున్నాడు. ఇది కూడా అటు ఇటుగా ఒక 40 నిమిషాలు ఉండి మొత్తం చిరంజీవి కుటుంబాన్ని దీనిలోకి లాగుతున్నాడు. ఈ సినిమా కూడా అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అప్పట్లో అల్లు అరవింద్ చెప్పినట్లు నిజంగానే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మను సినీ ఇండస్ట్రీ నుంచి తరిమేస్తాడా? అసలు అల్లు అరవింద్ కు అంత సీన్ ఉందా? చూడాలి ముందు ముందు ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది. అసలు వర్మ ఇప్పటికే సినిమా తీసేశాడనేవారు కూడా ఉన్నారు. వర్మ ఏదైనా సైలెంట్ గా ముగించిన తరువాత రంగంలోకి దిగుతాడని అనేవారు ఉన్నారు. ఇదే నిజమైతే ఈవారంలో టీజర్, ట్రైలర్ పేరుతో హడావిడి మొదలు పెట్టేస్తాడు.