ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బయోపిక్ తెరకెక్కబోతుంది. మూడు భాగాలుగా ఈ సినిమాను తీస్తున్నట్లు వర్మ తెలిపారు. 20 ఏళ్ళ యువకుడు దొరసాయి తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ నటిస్తున్నాడు. పార్ట్-1 కు ‘రాము’ అనే టైటిల్ ఖరారు చేశారు. వర్మ తల్లి, సోదరిలు ఈ సినిమాకు బుధవారం క్లాప్ కొట్టి ప్రారంభించారు.

ఇక ఈ సినిమాకు దొరసాయి తేజ దర్శకత్వం వహించడంతో పాటు యుక్త వయసులో వర్మ రోల్ ను పోషిస్తున్నాడు. ఇక బయటకి దీన్ని వేరే దర్శకుడు తీసుకొస్తున్నా దీని తెరవెనక మాత్రం కర్త, కర్మ, క్రియ మొత్తం వర్మనే. ఇక ఈ సినిమాకు సంబంధించి మూడు భాగాలను బొమ్మకు మురళి నిర్మించనున్నాడు.

అల్లు అర్జున్ పై పోలీసులకు పిర్యాదు..!

‘ఖైదీ’ దర్శకుడితో కమల్ హాసన్ భారీ ప్రాజెక్ట్..!