ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజ్రంభిస్తున్న వేళ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోలు, ఇతర నటీమణులు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రధాని మోదీకి విరాళాలు అందచేస్తూ వారి వంతు సహాయం చేస్తున్నారు. దీనితో పాటు కరోనా వైరస్ ను అరికట్టే దానిలో భాగంగా సంగీత దర్శకుడు కోటి స్వారపరిచిన కరోనా వైరస్ పాటలో చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్ తదితర నటులు నటించారు.

ఈ పాటను ఆర్జీవీ తన ట్విట్టర్ లో రీ ట్వీట్ చేస్తూ “మల్టీస్టారర్ సాంగ్ చాల అద్భుతంగా ఉందని, కరోనా వైరస్ కు కూడా ఈ పాట నచ్చుతుందని” అన్నారు. ఇక నేను నా కరోనా సాంగ్ ను ఫూల్స్ డే నాడు విడుదల చేయబోతున్నట్లు తెలియచేసారు. దీనితో పాటు రామ్ గోపాల్ వర్మ మరొక ట్వీట్ చేస్తూ తాను లాక్ డౌన్ సమయంలో నగరంలోని చాలా ప్రాంతాల్లో నేను తిరుగుతున్నానని కిచర్ పూర్, సోఫా చౌక్, బెడ్ రూమ్ నగర్, డైనింగ్ పేట, బాల్కనీ కార్నర్, ఫ్రిడ్జ్ స్ట్రీట్, బాత్ రూమ్ సర్కిల్, వాషింగ్ మెషీన్ నగర్, టెలివిజన్ స్టేషన్ అన్నీ తిరిగేస్తున్నాను అంటూ చమత్కారంగా ట్వీట్ చేయడంతో పెద్ద వైరల్ గా మారింది. కరోనా వైరస్ నేపథ్యంలో రోజుకొక డిఫరెంట్ ట్వీట్ చేస్తూ తన అభిమానులను రామ్ గోపాల్ వర్మ ఎంటర్టైన్ చేస్తున్నారు.