క్రికెట్ లో రికార్డుల వీరుడిగా మారిపోయిన విరాట్ కోహ్లీ అన్ని ఫార్మేట్ లలో తన సత్తా కొన్నేళ్లుగా పదిలంగా ఉన్న రికార్డ్స్ ను తన పేరిట లిఖించుకుంటున్నాడు. ఇప్పటికే టీ20 అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఈ రికార్డును బద్ధులు కొట్టేందుకు రోహిత్ శర్మకు ఈరోజు మంచి అవకాశం వచ్చింది. ఇప్పటి వరకు కోహ్లీ టీ20 కెరీర్ లో 2450 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉండగా కోహ్లీ కన్నా ఎనిమిది పరుగుల దూరంలో రోహిత్ శర్మ ఉన్నాడు.

ఈరోజు బంగ్లాదేశ్ తో జరిగే మొదటి టీ20 మ్యాచ్ తో ఈ ఫీట్ సాధించి నెంబర్ 1 స్థానానికి వెలతాడేమో చూడాలి. బంగ్లాదేశ్ సిరీస్ కు విరాట్ కోహ్లీ రెస్ట్ తీసుకోవడంతో రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ మ్యాచ్ లో యువ వికెట్ కీపర్లు రిషబ్ పంత్, సంజు శాంసన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. రిషబ్ పంత్ వికెట్ల వెనుక కీపర్ గా ఉంటే, సంజు శాంసన్ మాత్రం ఫీల్డింగ్ చేయనున్నాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో ఈరోజు సాయంత్రం మ్యాచ్ జరగనుంది.