ఇటీవల ‘అంతర్వేది’లో రధం తగలబడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అధికార, ప్రతిపక్ష నేతలు పరస్పరం ఒకరికొకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఈ రధం తగలబడిన ఘటనలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హస్తం ఉందని వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో రైలు దహనం, రాజధాని భూములు తగలబెట్టిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించిన రోజా.. సిబిఐ రాష్ట్రానికి రావద్దని జీవో ఇచ్చిన బాబు ఇప్పుడు సిబిఐ విచారణ కోరుతున్నారంటూ ఎద్దెవా చేశారు. ఇక తమ చిత్తశుద్ధి నిరూపించుకునేందుకు సీఎం జగన్ సిబిఐ విచారణకు ఆదేశించారని రోజా అన్నారు.

మహేష్ బాబుని అడ్డుపెట్టుకొని ఎన్టీఆర్ తొ గేమ్స్ ఆడుతున్నారా?

పవన్ కళ్యాణ్ పెద్ద కామెడీ పీస్ గా మారిపోయాడు బాసు, కారణం ఏమిటో తెలుసా?