సెప్టెంబర్ 15వ తది అందరూ తమ కుటుంబాలతో గోదావరిలో బోట్ షీకార్ చేసి ఆనందంతో గడపాలని చూస్తే వారి జీవితాలలో పెను విషధాన్ని మిగిల్చిన బోటుని దాదాపుగా 38 రోజులకు బయటకు తీశారు. ఈ ఘటనలో మొత్తం 39 మంది చనిపోతే, 26 మంది ప్రాణాలతో బయటపడ్డారు. బోటుని వెలికితీయడానికి ఎంత కష్టపడినా బయటకు తీయడానికి సహకారం దొరకకపోవడంతో చివరకి కాకినాడకు చెందిన బోటు నీళ్లలో నుంచి వెలికితీయడంలో సిద్ధహస్తులైన ధర్మాడి సత్యం బృందానికి అప్పగించడంతో వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు బయటకు తీశారు.

ఇప్పటికే బోటు వెలికితీయడంలో ఎన్నో ప్రయోగాలు చేసి విఫలమయ్యి చివరకు సంప్రదాయ పద్ధతిలో లంగర్లు, రోప్ లు కట్టి బయటకు తీశారు. బోటు బయటకు తీసినా బోటు మొత్తం చెల్లచెదురుగా ఉంది. బోటులో బాగా ఒండ్రు మట్టి పేరుకుపోవడంతో దానిలో నుంచి ఇప్పటికే ఎనిమిది మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను బయటకు తీయడానికి స్థానిక మత్యకారులతో పాటు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పనిచేస్తున్నాయి.

ఇక రాయల వశిష్ఠ ఆపరేషన్ ముగియడంతో ధర్మాడి సత్యం బృందం అక్కడ నుంచి వెనుతిరిగింది. బోటు బయటకు తీయడంలో తాము సిద్ధ హస్తులమని మరోసారి ఆ బృందం నిరూపించుకోవడంతో అందరి నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక బోటులో దొరికిన ఎనిమిది శవాలను మార్చురికి తరలించారు.