రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం బీమ్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఈ సినిమాను డీవీవీ ప్రొడక్షన్స్ పతాకంపై దానయ్య 400 కోట్ల బారి బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. మరి ఇంత పెద్ద మొత్తాన్ని దానయ్య ఒక్కడే ఎలా పెడుతున్నాడని ప్రశ్నలు రావచ్చు. నిజానికి ఈ సినిమాకు దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నా అన్ని విషయాలను రాజమౌళిని చూచుకుంటున్నాడట.

కాగా రాజమౌళినే ఈ సినిమాకు స్వయంగా ఫైనాన్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. బాహుబలి- 2 కి మాట్రిక్స్ ప్రసాద్ ఫైనాన్స్ చేశారు. దీంతో ఈ సినిమాకు కూడా ఆయనే ఫైనాన్స్ చేశారట. అయితే మాట్రిక్స్ ప్రసాద్ ఫైనాన్స్ రాజమౌళి పేరు మీదే ఇస్తానని చెప్పాడు. దీంతో రాజమౌళి ఒకే చెప్పడంతో ఈ సినిమాకు ఫైనాన్స్ లభించిందట. ఇక ఈ సినిమాకు నిర్మాత దానయ్య అయినప్పటికి రాజమౌళిదే మెజార్టీ వాటా అని అంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా మార్కెటింగ్ వ్యవహారాలన్నీ కూడా రాజమౌళి కుమారుడు కార్తిక్ చుసుకుంటున్నాడని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా బట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ముందుగా అనుకున్న జులై 30న కాకుండా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •