బాహుబలి సినిమా తరువాత రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించి షూటింగ్ చకచకా జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి ఇప్పటికే టాకీ పార్ట్ చాల వరకు పూర్తయిందని చెబుతున్నారు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితులలో వచ్చే వేసవికి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాలో హీరోలుగా రామ్ చరణ్ – ,ఎన్టీఆర్ నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తుంటే, ఎన్టీఆర్ కొమరంభీం పాత్రను పోషిస్తున్నారు. కానీ వీరిద్దరూ ఎక్కడ కలుస్తారు అన్నది అందరికి ఉత్కంఠతగా ఉంది. కానీ ఫిల్మ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఒక పాపను రక్షించే సీన్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు కీలకమైన ఎపిసోడ్ గా చెబుతున్నారు. ఎన్టీఆర్ ప్రాణాలకు తెగించి ఆ పాపను కాపాడటంతో రామ్ చరణ్ అతడికి సహాయం చేస్తాడని, ఆ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ అని చెబుతున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ లో పులితో ఫైట్ చేసే సీన్ ఉంటుందని చెబుతున్నారు. పులితో ఫైట్ చేసే సీన్స్ మోహన్ లాల్ “మన్యం పులి” సినిమాలో దర్శకుడు అద్భుతంగా చూపించాడు. ‘మన్యం పులి’ సినిమాలో పులితో మోహన్ లాల్ యాక్ట్ చేసే సీన్ ఎన్నిసార్లయినా చూడవచ్చు. ఇక రాజమౌళి అంతకు మించి అనేలా చిత్రీకరిస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఈ సినిమా టైటిల్ కు సంబంధించి చిత్ర యూనిట్ ఇంకా ఫైనల్ కు రాలేదని చెబుతున్నా “రామ రౌద్ర రుషితం” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఎన్ని రూమర్లు బయటకు వచ్చిన రాజమౌళి తన సినిమా న్యూస్ బయటకు రాకుండా ఎంతో జాగ్రత్త పడతాడు. రాజమౌళి చెప్పే వరకు ఇలాంటి న్యూస్ వస్తూనే ఉంటాయి.