రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో “ఆర్ఆర్ఆర్” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు రామోజీఫిల్మ్ సిటీలో త్వరితగతిన జరుగుతుంది. ఈ సినిమా వచ్చే ఎడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ బల్క్ డేట్స్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం బీమ్ పాత్ర పోషిస్తున్నారు.

ఈ సినిమా కోసం దాదాపుగా రెండేళ్ల పాటు ఎన్టీఆర్ , రామ్ చరణ్ తమ సమయాన్ని వెచ్చించడంతో పాటు అత్యంత బారి ఖర్చుతో సినిమా తెరకెక్కుతుండటంతో రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే ఇస్తున్నారని తెలుస్తుంది. ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న దాని ప్రకారం ఈ సినిమా కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరికి చెరొక పాతిక కోట్లు ముట్టచెప్పనున్నారట. దీనితో పాటు సినిమా షూటింగ్ జరిగిన అన్ని రోజులు నెలకు ఒకొక్కరికి పది లక్షల రూపాయలు షూటింగ్ ఖర్చుల కోసం ఇవ్వనున్నారని, ఇదంతా సినిమా షూటింగ్ మొదలయ్యే ముందే మాట్లాడుకున్నారని చెబుతున్నారు.

ఇక ఇంత బారి బడ్జెట్ తో నిమిస్తున్న రాజమౌళి ఈ సినిమా లాభాలలో వాటాలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. వందల కోట్ల రూపాయల ఖర్చు పెట్టినా వేల కోట్ల రూపాయలు తీసుకొని వస్తాడని రాజమౌళి మీద నమ్మకం ఉండటంతో డివివి దానయ్య భారీగా ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమాలో వచ్చిన లాభాలలో సగం రాజమౌళికి ఇవ్వడంతో పాటు, రాజమౌళికి ఇచ్చే సగం వాటాలో సినిమాకు పనిచేస్తున్న తన కుటుంబసభ్యుల వాటా కూడా అందులోనే ఉంటుందట. ఇలా ఈ సినిమా గురించి లేటెస్ట్ గా ఫిల్మ్ నగర్ లో వార్త చక్కర్లు కొడుతుంది. వందల కోట్లతో నిర్మించే సినిమా కావడంతో ఇంకా మొదటి లుక్ బయటకు రాకముందే ఇన్ని వార్తలు వస్తుంటే ఒకొక్క లుక్ విడుదల చేస్తుంటే సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోతుందనడంలో ఆశ్చర్యం లేదు.