తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక ఆర్టీసీ కార్మికులతో చర్చలు లేవని, వారందరు వారికి వారే ఉద్యోగాల నుంచి తప్పుకున్నారని, ప్రస్తుతానికి ఆర్టీసీకి ఉంది 1200 మంది ఉద్యోగులే అని త్వరలో కొత్త నియామకాలు చేపట్టి ఉద్యోగాలలోకి కొత్త వారిని తీసుకుంటామని ప్రభుత్వం, ప్రైవేట్ రెండు కలసి ఆర్టీసీని ముందుకు తీసుకొని వెళతామని, ఇక ఆర్టీసీ కార్మికులతో చర్చలు లేవని, రెండు సారూ ఇప్పటికే ఉన్నత స్థాయి భేటీ నిర్వహించి తేల్చి చెప్పారు.

కానీ ఆర్టీసీ కార్మికులు మాత్రం ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ఆర్టీసీ సమ్మెను మరింత ఉదృతం చేయనున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో ఈరోజు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పక్షాలు కూడా పాల్గొన్నాయి. తెలంగాణ జనసేన పార్టీ నేత శేఖర్ గౌడ్ ఈ సమావేశంలో పాల్గొని సమ్మెకు జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని, జేఏసీ ఎలాంటి నిర్ణయం తీసుకున్న తమ పార్టీ మద్దతు తెలుపుతుందని, అవసరమైతే ఆర్టీసీ కార్మికుల కోసం పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకు వచ్చి మీ కోసం ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని అన్నారు.

ఈ సమావేశంలో ఆర్టీసీ నేత అశ్వద్ధామ రెడ్డి మాట్లాడుతూ తమ సమ్మెకు ఉద్యోగ సంఘాల మద్దతు కావాలని కోరారు. ఇక ఆర్టీసీ కార్మికులు మరింత ఉదృతంగా ముందుకు వెళ్లి ప్రభుత్వ వైఖరిని ఎండ గట్టడంతో పాటు, వచ్చే హుజుర్ నగర్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని కూడా చర్చించుకున్నారట.