నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న పక్క మాస్ కమర్షియల్ సినిమా ‘రూలర్’. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సోనాలీ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్.

బాలకృష్ణ మార్క్, పంచ్ డైలాగులు ఈ ట్రైలర్ లో అద్భుతంగా ఉన్నాయి. ఈ ట్రైలర్ కు అభిమానుల నుండి మంచి స్పందన వస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే అభిమానులకు పూనకాలు తెప్పించే విధంగా ఈ ట్రైలర్ ఉంది. ఇక ఎన్టీఆర్ బయోపిక్ తో అభిమానులను నిరాశపరిచిన బాలకృష్ణ.. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నాడు. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో డిసెంబర్ 20న విడుదల కానుంది.