కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న తాజా సినిమా ‘రూలర్’. సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమాలో భూమిక కీలక పాత్రలో నటిస్తుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఒంటి మీద ఖాకి యూనిఫామ్ ఉంటేనే బోనులో పెట్టిన సింహంలా ఉంటా.. యూనిఫామ్ తీసానో బయటకొచ్చిన సింహంలా ఆగను.. అంటూ బాలయ్య చెప్పే డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది.

ఇక ఇప్పటికే ‘రూలర్’ కి సంబందించిన బాలయ్య స్టైలిష్, మాస్ లుక్ సినిమాలపై అంచనాలను పెంచాయి. ఇప్పడు టీజర్ మరింత ఆసక్తికరంగా ఉంది. చిరంతన్ బట్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. ఇక క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.