అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న “సరిలేరు నీకెవ్వరూ” సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పై ఇప్పటికే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపున ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా “సరిలేరు నీకెవ్వరూ” సినిమా టైటిల్ సాంగ్ కూడా అభిమానులను ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

మహేష్ బాబు మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ గా చాల రోజుల తరువాత ఒక మంచి మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందు రానున్నాడట. కానీ ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు, మొదటి సాంగ్ చూసిన అందరకి సీరియస్ నెస్ తో కూడిన యాక్షన్ ఉంటుందని అనుకున్నారు. కానీ అనిల్ రావిపూడి ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ మంచి కామెడీ టైమింగ్ ఉన్న సినిమాలు కావడంతో, ఈ సినిమాలో కూడా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫుల్ కామెడీ జోడించడంతో అందరిని అబ్బురపరుస్తుందట.

ఈ ఏడాది మొదట్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన “F2” సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిన విషయమే. ఈ సినిమాలో వెంకటేష్ – వరుణ్ తేజ్ కామెడీతో కితకితలు పెట్టారు. అలానే “సరిలేరు నీకెవ్వరూ” సినిమా కూడా మొదటి అర్ధభాగం ఫుల్ మాస్ తో ఉండి, రెండవ అర్ధభాగం ఫుల్ కామెడీతో అటు మాస్ తో పాటు, క్లాస్ ను కూడా ఆకట్టుకొని సంక్రాంతి సీజన్ లో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.