కరోనా వైరస్ తీవ్రంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దాన్ని నియంత్రించడంలో భాగంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో పూర్తిగా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడే స్తంభించి పోయింది. అయితే ఇప్పటికిప్పుడే కరోనా వైరస్ తెగ్గే అవకాశం లేదని భావించిన ఓ ప్రేమ జంట ఓ ట్రక్కులో రహస్యంగా తమ స్వస్థలానికి వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఘటన హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో జరిగింది.

కుల్లు జిల్లాలోని నిర్మాండ్ ప్రాంతానికి చెందిన ఓ ఇరవయ్యేళ్ల యువకుడు, ముప్పయ్యేళ్ల రష్యన్ యువతీ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. లాక్ డౌన్ కారణంగా నోయిడాలో ఇరుక్కుపోయిన వీరు తమ స్వస్థలానికి వెళ్లి పెళ్లిచేసుకోవాలనుకున్నారు. ఇక అక్కడ నుండి వస్తున్న ఓ ట్రక్కులో రహస్యంగా సిమ్లా మీదగా ప్రయాణిస్తుండగా, పోలీసులకు అనుమానం రావడంతో షోగి ప్రాంతం వద్ద ట్రక్కును చెక్ చేయడంతో వీరిద్దరూ దొరికారు. ఇక క‌ర్ఫ్యూ పాస్ ను పోలీసులు చూపించమనడంతో వారి దగ్గర సమాధానం లేకపోవడంతో ప్రేమికులను అదుపులోకి తీసుకున్నారు. ఇక వీరితో పాటు డ్రైవర్, క్లినర్ ను కూడా అదుపులోకి తీసుకుని క్యారంటైన్ కు తరలించారు.

ఆర్ఆర్ వెంకటాపురంలో భయానక వాతావరణం..!

ప్రపంచ దేశాలను మరోసారి హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ..!