సుజిత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ‘సాహో’. ‘బాహుబలి’ సినిమా తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా తొలి రోజునే 100 కోట్లను కొల్లగొట్టింది. కేవలం 10 రోజులలోనే ఈ సినిమా 400 కోట్ల మార్కును అందుకుని రికార్డు సాధించింది. ఇప్పటికి చాలా చోట్ల ‘సాహో’ కలెక్షన్స్ స్టడీ గా ఉండడంతో మరి కొన్ని రికార్డ్స్ సాధిస్తుందన్న ఆశతో ఉన్నారు అభిమానులు.

తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేశారు చిత్ర యూనిట్. ప్రభాస్ అభిమానులతో కలసి ‘సాహో’ సినిమా చూడటం చర్చనీయాంశంగా మారింది. హాలీవుడ్ తరహాలో యాక్షన్ సీన్స్ తో తెరకెక్కించిన ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ లు నిర్మించారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •