“సాహో” సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో బిగ్ గేమ్ మొదలు కాబోతుంది. బాహుబలి సినిమాతో దాదాపుగా 1500 కోట్ల రూపాయలను కొల్లగొట్టి దేశంలో టాప్ హిట్ లిస్ట్ హీరోలలో పేరు సంపాదించిన ప్రభాస్ ఇప్పుడు “సాహో” పేరుతో మరొక గేమ్ కు తెరతీశాడు. దాదాపుగా ఈ సినిమాను 250 కోట్ల రూపాయలకు అటు ఇటుగా యువీ క్రియేషన్స్ ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. కొంత మంది అతి తెలివిగల మేధావులుగా ముద్ర వేసుకొని ఒక్క సినిమాకు అంత ఖర్చు అవసరమా ఈ సినిమా ఖర్చుతో దాదాపుగా చిన్నపాటి రెండు నీటి ప్రాజెక్ట్స్ నిర్మించవచ్చని అంటున్నారు.

అవును అవి నీటి ప్రాజెక్ట్స్ అయితే… ఇది సినిమా ప్రాజెక్ట్…. సినిమా హిట్ అయితే ఈ ప్రాజెక్ట్ లో వచ్చే డబ్బుల వ్యవహారం అంతా వందల కోట్లలో ఉంటుంది. కానీ అలా నీటి ప్రాజెక్ట్స్ తో ఇలా సినిమా ప్రాజెక్ట్ ను పోల్చి చూడటం ఎంత వరకు సబబు. మీకు తెలుసుగా అది రైతులకు మేలు చేసే నీటి ప్రాజెక్ట్ అయితే ఇది సినిమా ప్రేమికులను ఆకట్టుకునే ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ ను ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో కడితే… ఈ సినిమా ప్రాజెక్ట్ నిర్మాత తాను కష్టపడి సంపాదించిన సొమ్ముతో పాటు… 10 రూపాయల ఇంట్రెస్ట్ కు బయట అప్పో… సోప్పో చేసి ఆడే అతి పెద్ద గేమ్ ఒక విధంగా చెప్పాలంటే ఇది కూడా ఒక బెట్టింగ్… క్రికెట్, షేర్ మార్కెట్ బెట్టింగ్ లాంటిందే…

క్రికెట్ బెట్టింగ్ పెడితే ఒక మూడు గంటలలో ఆటో, ఇటో తేలిపోతుంది…. షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే నిమిషాలలో కుబేరులైన అవ్వవచ్చు… బిచ్చగాళ్లుగా కూడా మారవచ్చు. ఇక “సాహో” సినిమా ప్రాజెక్ట్ బెట్ రెండు గంటల నలభై నిముషాలు… సినిమా హిట్ అయ్యిందా ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్… ప్లాప్ అయ్యిందా వారాంతరంలో వచ్చే మూడు రోజులలో ఎంత వెనకవేసుకుంటే అంతే… తరువాత థియేటర్ వైపు కూడా చూడరు. కానీ ఈ బెట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ బెట్ కోసం ఎంతో మంది పోటీ పడతారు. తనకు కావాలంటే తనకు కావాలని గగ్గోలు పెట్టి సినిమాను చేజిక్కించుకొని ఆనందపడిపోతారు. ఒకవేళ సినిమా హిట్ అయితే పండుగ చేసుకుంటారు… లేకపోతే నిర్మాత ఇంటి ముందు టెంట్ లు వేసుకుని మా డబ్బు మాకు ఇచ్చేయండి అని గగ్గోలు పెడతారు.

బెట్ పెట్టినప్పుడు ఎక్కడైనా తిరిగి ఇస్తారా… కానీ సినిమా ప్రాజెక్ట్ లో కండిషన్స్ అప్లై… కొన్ని సార్లు ప్లాప్ అయితే రిటర్న్స్ ఉంటాయి… అందుకే ఈ బెట్ కాస్త డిఫరెంట్… ఇప్పుడు “సాహో” ఆడుతున్న బెట్ అతి పెద్దది… అత్యంత ప్రతిష్టాత్మకమైనది… ఇండియా మొత్తం ఈ “సాహో” బెట్ కోసమే ఎదురు చూస్తున్నారు. హాలీవుడ్ లెవెల్ లో మైమరిపిస్తారా… గల్లీ లెవెల్ లో తేలిపోతారా మరొక్క 15 రోజులు… అప్పటి వరకు 330 కోట్ల రూపాయల బెట్ పై పందేలు కాసింది ఎవరో రోజుకొక వార్తతో… సినిమాపై రోజుకొక కొత్త అప్డేట్ తో హల్ చల్ చేస్తూనే ఉంటుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •