స్పోర్ట్స్ అధారిటీ అఫ్ ఇండియా(సాయ్) నిర్వహించే ట్రయల్స్ లో ఇప్పుడే పాల్గొనలేనని దానికి కొంత సమయం కావాలని సాంప్రదాయ క్రీడ ‘కంబళ’ పోటీదారుడు శ్రీనివాస్ గౌడ్ తెలిపాడు. సాయ్ నిర్వహించే పోటీలో నేను ఇప్పుడే పాల్గొనలేనని ‘కంబళ’లో మరిన్ని ఘనతలు సాధించాలనుకుంటున్నానని అన్నారు.

ప్రస్తుతం కంబళి టోర్నమెంట్ కొనసాగుతుంది. అందుకే ఒక నెల గడువుకావాలని సాయ్ ను కోరతానని అన్నాడు. ఇక ఇంతలా ప్రఖ్యాతి చెందుతానని ఎప్పుడు అనుకోలేదన్న ఆయన.. దీనిలో నా దున్నపోతులదే కీలక పాత్రన్నారు. అయితే అందరూ నన్ను ఉసేన్ బోల్డతో పోలుస్తున్నారని.. ఆయన ప్రపంచ ఛాంపియన్. నేను కేవలం బురద వరి పొలాల్లో పరిగెత్తేవాడినని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇక శ్రీనివాస్ గౌడ్ ను కర్ణాటక సీఎం యడియూరప్ప శాలువాతో సన్మానించి 3 లక్షల నగదు బహుమతిని అందించారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •